AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 ప్రీమియర్‌లో మహిళ మృతి.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్

అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ హంగామాలో అపశ్రుతి చోటు చేసుకుంది. బుధవారం (డిసెంబర్ 04) రాత్రి జరిగిన తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Pushpa 2: పుష్ప 2 ప్రీమియర్‌లో మహిళ మృతి.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Dec 05, 2024 | 3:20 PM

Share

అల్లు అర్జున నటించిన పుష్ప-2 గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే చాలా చోట్ల బుధవారమే (డిసెంబర్ 04) ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడ్డాయి. ఇక హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ లోనూ పుష్ప 2 ప్రీమియర్ షోష్ ప్రదర్శించారు. సాధారణంగానే ఈ థియేటర్‌ కు ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా రావడంతో థియేటర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో జరిగన తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా రేవతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం పట్ల దురదృష్టకరమని తెలిపింది. ఆ కుటుంబాన్ని త్వరలోనే కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ విషాద ఘటనపై రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ‘మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాం. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. కానీ నా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నాను. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us