AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటుకులు అని లైట్‌ తీసుకుంటున్నారా..? బరువు తగ్గించడంతో పాటు గుండెను పదిలంగా ఉంచే అద్భుత ఔషధం!

భారతీయ వంటకాల్లో అటుకులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. పౌరాణికంగా శ్రీకృష్ణుడికి కుచేలుడు అందించిన కానుకగా ప్రసిద్ధి చెందిన అటుకులు, నేడు ప్రతి ఇంటా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా మారాయి. ఇది కేవలం రుచికరమైన టిఫిన్ మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే అద్భుతమైన సంపూర్ణ ఆహారం. తక్కువ సమయంలో, తక్కువ నూనెతో తయారు చేసుకునే అటుకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

Jyothi Gadda
|

Updated on: Oct 26, 2026 | 10:09 AM

Share
శ్రీకృష్ణుడికి కుచేలుడు ఇచ్చిన కానుకగా భావించే అటుకులు కేవలం రుచికరమైన అల్పాహారమే కాకుండా, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న సంపూర్ణ ఆహారం. ఇందులో క్యాలరీలు, కొవ్వు శాతం చాలా తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. కూరగాయలు, వేరుశనగలు కలిపి చేసుకునే ఈ అల్పాహారం గుండెను పదిలంగా ఉంచడంతో పాటు రోజంతా తక్షణ శక్తిని అందిస్తుంది.

1 / 5
రక్తహీనత నివారణ, మధుమేహ బాధితులకు మేలు: అటుకులను తయారు చేసే ప్రక్రియలో ఇవి సహజంగానే ఐరన్ కంటెంట్‌ను పొందుతాయి. కూరగాయలు, వేరుశనగలు, నిమ్మరసంతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. రక్తహీనతతో బాధపడేవారికి, గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాకుండా, అటుకులు రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా వైద్యుల సూచన మేరకు పరిమితంగా వీటిని తీసుకోవచ్చు.

2 / 5
గుండెకు రక్షణ, గ్లూటెన్ రహిత ఆహారం: అటుకుల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో లాక్టోస్, ఫ్యాట్, గ్లూటెన్ ఉండవు. గోధుమలతో తయారైన ఆహారం పడని వారు అటుకులను హ్యాపీగా తినొచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని అందిస్తాయి. బియ్యంతో తయారైనప్పటికీ, అన్నం తిన్నంత తృప్తిని ఇస్తాయి.

3 / 5
రుచికరంగా మార్చుకునే చిట్కాలు: అటుకులను క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో వండుకుంటే ఇది విటమిన్ల గనిగా మారుతుంది. అయితే అటుకులను ఎక్కువ సేపు నీళ్లలో నానబెట్టకుండా, కేవలం కడిగి వెంటనే వడకడితే అవి పొడిపొడిగా వస్తాయి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండటం వల్ల అందులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. కాబట్టి రోజూవారీ డైట్‌లో అటుకులను భాగం చేసుకుని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

4 / 5
బరువు నియంత్రణ, తేలికైన జీర్ణక్రియ: అటుకులలో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉదయాన్నే అటుకులు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అనవసరమైన స్నాక్స్ తినకుండా నిరోందించి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇతర అల్పాహారాలతో పోలిస్తే ఇవి చాలా తేలికగా అరిగిపోతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అనారోగ్యంతో బాధపడేవారు కూడా వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

5 / 5
Follow Us