AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనకు తెగితే రక్తం వాళ్లకు తెగితే టమాటా కెచపా.? షాలినికి చుక్కలు చూపించిన శివాజీ..!

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఎల్లో, గ్రీన్ జోన్లలో ఉన్నప్పటికీ నామినేషన్స్‌లో ఉండటంతో వర్షిణి, ‌శివ్లకు ఆడియెన్స్ ఓట్లు వేశారా, లేదా.? అనే ఉత్కంఠకు నాగ్ తెరదించారు. వీళ్లిద్దరూ ఆడియెన్స్ ఓట్లతో సేఫ్ అయినట్లు నాగ్ అనౌన్స్ చేశారు .

మనకు తెగితే రక్తం వాళ్లకు తెగితే టమాటా కెచపా.? షాలినికి చుక్కలు చూపించిన శివాజీ..!
Bigg Boss Buzzz
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2026 | 11:00 AM

Share

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఎలిమినేట్ అయిన షాలిని.. బయటకు వచ్చిన తర్వాత తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బిగ్ బాస్ బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ షాలిని పై ప్రశ్నల వర్షం కురిపించాడు. హౌస్‌లో జరిగిన గొసగసలు, బ్యాక్ బిచింగ్, ఇతర కంటెస్టెంట్లతో విభేదాలు, ముఖ్యంగా రోహిత్‌తో ఆమెకున్న బంధం గురించి ప్రశ్నిస్తూ షాలినికి చుక్కలు చూపించాడు. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ టీమ్. హౌస్‌లో తనను కొంతమంది గౌరవం లేకుండా మాట్లాడినట్లు అనిపించిందని షాలిని తెలిపారు. తనను తీసిపారేసినట్లు మాట్లాడారని భావించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన శివాజీ.. అసభ్య పదాలు ఉపయోగించడం కూడా డిస్రెస్పెక్ట్ కాదా? అంటూ ప్రశ్నించారు. ఎఫ్, ఎం, జీ వంటి పదాలను ఉపయోగించడం గౌరవం లేకుండా మాట్లాడటమే కదా? అని శివాజీ అడిగారు. అయితే తాను ఎఫ్ వర్డ్ ఉపయోగించలేదని షాలిని స్పష్టం చేశారు. దీంతో హౌస్‌లో జరిగిన డిస్కషన్స్, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై చర్చ ఆసక్తికరంగా సాగింది.

గతంలో సీక్రెట్ రూమ్‌కు వెళ్లి తిరిగి హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లతో పోలుస్తూ శివాజీ షాలినిని ప్రశ్నించారు. సీక్రెట్ రూమ్‌కు వెళ్లి వచ్చిన వారు ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నరప్ అయ్యారు.. కానీ షాలిని అదే వారంలో ఎలిమినేట్ కావడంపై ప్రస్తావిస్తూ, హౌస్‌లో ఆమె ఆటతీరు, ప్రేక్షకుల స్పందన గురించి చర్చించారు. ఇక రోహిత్‌కు బయట మంచి బజ్ ఉందనే కారణంతో హౌస్‌లో కొందరు అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని షాలిని చేసిన వ్యాఖ్యపై శివాజీ  క్లారిటీ అడిగారు. రోహిత్ విషయంలో ఆమె ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

రోహిత్‌తో తనకున్న ఫ్రెండ్ షిప్ విడగొట్టేందుకు కొందరు ప్రయత్నించారని షాలిని చెప్పిందని తెలుస్తుంది. హౌస్‌లో తామిద్దరం ఎక్కువ సమయం కలిసి ఉండేవాళ్లమని షాలిని అనగానే.. నిద్రపోయే సమయం మినహా దాదాపు అన్ని సందర్భాల్లోనూ ఒకే చోట ఉండేవాళ్లు కదా అని శివాజీ అన్నారు. హౌస్‌లో షాలిని ఏడ్చిన సందర్భాలను ప్రస్తావిస్తూ, ఆమె సింపతీ కోసం అలా చేశారనే అభిప్రాయంపై శివాజీ ప్రశ్నలు సంధించారు. ఇతర కంటెస్టెంట్లు ఏడ్చినప్పుడు కూడా ఇదే విధంగా కామెంట్ చేశావా? అని అడిగారు. ఇక లాస్ట్ లో షాలిని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. మరి పూర్తి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us