AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, గుడ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. రోజూ గిన్నెడు తింటే విరిగిన ఎముకలు బలంగా..

ఒక ప్రత్యేకమైన, నోరూరించే వంటకం.. పెసరపప్పు సేమ్యా పాయసం. ఈ పాయసం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, బెల్లం పెసరపప్పు వాడుతాము కాబట్టి ఆరోగ్యకరమైనది కూడా. దీనిని తింటే ఎముకలు బలంగా మారతాయి. పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది . ఇది పిల్లలకు, పెద్దలకు మంచి ప్రసాదంగా ఇంకా సాయంత్రం అల్పాహారంగా మంచి ఎంపిక అని చెప్పుకోవాలి.

Prasanna Yadla
|

Updated on: Oct 26, 2026 | 10:47 AM

Share
కావాల్సిన పదార్థాలు:  పెసరపప్పు: 1/2 కప్పు,  రెండు కప్పులు నీళ్లు,  ఒక టేబుల్ స్పూన్  నెయ్యి, పావు కప్పు  సేమ్యా,  డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు, కిస్మిస్): రుచికి సరిపడా,  తురిమిన బెల్లం: పావు కప్పు,  విడిగాబెల్లం కరిగించడానికి  నీళ్లు 3/4 కప్పు,  యాలకుల పొడి: 4-5 యాలకులు,  ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి.

1 / 5
పెసరపప్పు వేయించడం: ముందుగా ఒక పాన్‌లో అర కప్పు పెసరపప్పు వేసి, నెమ్మది మంటపై కమ్మటి వాసన వచ్చేంతవరకు  కలుపుతూ వేయించుకోవాలి. రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించిన పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు పోసి పక్కన నానబెట్టుకోవాలి. ఇది ఉడికే సమయాన్ని తగ్గిస్తుంది.

2 / 5
అదే పాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేసి, అది కరిగిన తర్వాత పావు కప్పు సేమ్యా వేయాలి. సేమ్యాను కూడా నెమ్మది మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి, బాదం, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి, అన్నీ బాగా వేగేంతవరకు వేయించి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
పాన్‌లో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, మంటను తగ్గించి, నానబెట్టిన పెసరపప్పును వేయాలి. పెసరపప్పును కుక్కర్‌లో కూడా ఉడికించవచ్చు, కానీ నేరుగా ఉడికిస్తే పాయసానికి మరింత రుచిగా ఉంటుంది  మరీ మెత్తబడకుండా ఉంటుంది. ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత, వేయించిన సేమ్యాను వేసి బాగా కలపాలి. సేమ్యా మరీ మెత్తబడకుండా ఉండాలంటే, పెసరపప్పు వేసిన ఐదు నిమిషాల తర్వాత సేమ్యా వేయడం మంచిది. మూత పెట్టి, మూతను కొద్దిగా పక్కకు జరిపి, పప్పు, సేమ్యా మెత్తబడేంతవరకు ఉడికించాలి.

4 / 5
మరోవైపు, ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని, ముప్పావు కప్పు నీటితో కలిపి కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. పెసరపప్పు, సేమ్యా చక్కగా ఉడికిన తర్వాత (అవి పలుకులుగా కనిపించినా, నొక్కితే మెత్తగా ఉండాలి), కరిగించుకున్న బెల్లం నీటిని వడగట్టి పాయసంలో కలపాలి. అంతా బాగా కలిపి, మూత పెట్టి, నెమ్మది మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది దగ్గర పడుతుంది.  స్టవ్ ఆఫ్ చేసి, నాలుగు ఐదు యాలకులను పొడి చేసి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోయాలి. పాలను ఒకేసారి కాకుండా, రెండు మూడు టేబుల్‌స్పూన్ల చొప్పున పోసి కలుపుతూ మిగిలిన పాలు పోయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలను కలిపిన తర్వాత, మళ్లీ స్టవ్ ఆన్ చేసి, రెండు నిమిషాల పాటు నెమ్మది మంటపై ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్మిస్, బాదం, కొబ్బరి ముక్కలు) వేసి కలిపితే కమ్మని పెసరపప్పు సేమ్యా పాయసం రెడీ.

5 / 5
Follow Us