Allu Arjun: పుష్ప రాజ్ స్టైల్‌లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా? వీడియో

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్రౌండ్ లో ధనాధాన్ ఇన్నింగ్స్ లు ఆడే ఈ మేటి బ్యాటర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. సినిమా డైలాగులు, ఫైట్స్, సాంగ్స్ ను రీక్రియేట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు.

Allu Arjun: పుష్ప రాజ్ స్టైల్‌లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా? వీడియో
Allu Arjun, David Warner
Follow us

|

Updated on: Jun 11, 2024 | 6:28 PM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్రౌండ్ లో ధనాధాన్ ఇన్నింగ్స్ లు ఆడే ఈ మేటి బ్యాటర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. సినిమా డైలాగులు, ఫైట్స్, సాంగ్స్ ను రీక్రియేట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే డేవిడ్ భయ్యాకు చాలా ఇష్టం. అందుకే కరోనా టైమ్ లో టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలకు రీల్స్ చేసి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. ఇక పాన్ ఇండియా సినిమా పుష్ప కు బ్రాండ్ ప్రమోటర్ గా మారిపోయాడీ డ్యాషింగ్ బ్యాటర్. అందులోని పాటలకు, డైలాగ్సులను ఎక్కువగా రీక్రియేట్ చేసిన వార్నర్ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి కాస్తా వైరలయ్యాయి. తాజాగా మరోసారి తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు డేవిడ్ భాయ్. ఎంతలా అంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం డేవిడ్ వార్నర్ కు రిప్లై ఇచ్చేలా.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ కోసం అమెరికాలో బిజిబిజీగా ఉంటున్నాడు డేవిడ్ వార్నర్. తాజాగా అతను ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

వేక్‌ఫిట్ మ్యాట్రెస్ యాడ్ లో నటించిన డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలోని బన్నీ క్యారెక్టర్ పుష్ప రాజ్ రోల్ ను రీక్రియేట్ చేశాడు. అంతేకాక హిందీలో డైలాగ్‌లు కూడా చెప్పాడు. పుష్ప రాజ్ స్టైల్ లో ఎడ‌మ చేత్తో త‌గ్గేదేలే అంటూ పోజ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వార్నర్ యాడ్ చూసిన అల్లు అర్జున్ కూడా ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్‌ సింబల్‌ షేర్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక సీక్వెల్ పుష్ప 2 ది రూల్.. లోని పుష్ప పుష్ప సాంగ్ హుషారైన స్టెప్పులు వేసి అదరగొట్టాడు డేవిడ్ వార్నర్. ఐకానిక్ షూ డ్రాప్ స్టెప్‌ ప్రాక్టీస్ చేసి బన్నీ ఫ్యాన్స్ ను మెప్పించారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు
పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు
వేగంగా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. రెండే రోజుల్లో మనిషి ఖతం
వేగంగా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. రెండే రోజుల్లో మనిషి ఖతం
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ..
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ..
జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!
జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!
పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్
పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు
600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!
600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!