Anand Deverakonda: ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..

ఇక ఇటీవలే గం గం గణేశా సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమాతో మరో హిట్ అందుకున్న ఆనంద్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇందులో ఆనంద్ కొత్త టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..
Anand Deverakonda
Follow us

|

Updated on: Jun 11, 2024 | 6:20 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆనంద్.. మొదటి చిత్రానికి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. ఆ తర్వాత విభిన్నమైన కంటెంట్ చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే గం గం గణేశా సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమాతో మరో హిట్ అందుకున్న ఆనంద్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇందులో ఆనంద్ కొత్త టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆనంద్..ఇప్పుడు సింగర్ గా మారాడు. ప్రస్తుతం ఆనంద్ ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆనంద్ బేబీ సినిమాలోని ఓ రెండు ప్రేమ మేఘలీలా సాంగ్ పాడి అదరగొట్టాడు. “కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక.. సందామామ సిరివెన్నెల లాగ.. వందేళ్ళయినా విడిపోక” లిరిక్స్ ఎంతో అద్భుతంగా పాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఆనంద్ మరో టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా 2023 జూలై 14న విడుదలైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ 11 రోజుల్లోనే దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా మ్యుజికల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్