AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raju Yadav OTT: అప్పుడే ఓటీటీలోకి రాజు యాదవ్.. గెటప్ శీను లేటెస్ట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

'జబర్దస్త్' తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో గెటప్ శీను కూడా ఒకరు. తన నటనా చాతుర్యం, విభిన్నమైన గెటప్పులతో బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మెగాస్టార్ చిరంజీవి సైతం పలు సార్లు గెటప్ శీను అభినయంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అటు బుల్లితెరను, ఇటు వెండితెరను ఏలేస్తున్నాడీ స్టార్ కమెడియన్

Raju Yadav OTT: అప్పుడే ఓటీటీలోకి రాజు యాదవ్.. గెటప్ శీను లేటెస్ట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Raju Yadav Movie
Basha Shek
|

Updated on: Jun 11, 2024 | 5:58 PM

Share

‘జబర్దస్త్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో గెటప్ శీను కూడా ఒకరు. తన నటనా చాతుర్యం, విభిన్నమైన గెటప్పులతో బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మెగాస్టార్ చిరంజీవి సైతం పలు సార్లు గెటప్ శీను అభినయంపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అటు బుల్లితెరను, ఇటు వెండితెరను ఏలేస్తున్నాడీ స్టార్ కమెడియన్. స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా నటిస్తోన్న గెటప్ శీను ఇటీవలే హీరోగా మారాడు. ‘రాజు యాదవ్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించాడు రాజు యాదవ్. అయితే మే 24నథియేటర్లలోకి వచ్చిన తర్వాత అభిమానుల అంచనాలను అందుకోవడంలో గెటప్ శీను సినిమా ఫెయిల్ అయ్యింది. గెటప్ శీను నటనకు ప్రశంసలు వచ్చినా కథా, కథనంలో లోపాలు అభిమానులను నిరాశపర్చాయి. దీంతో చాలా మంది రాజు యాదవ్ ను లైట్ తీసుకున్నరు. ఎంచెక్కా ఓటీటీలో చూసుకోవచ్చునని భావించారు. ఇప్పుడు వీరి కోసమే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కు వచ్చేస్తున్నాడు రాజు యాదవ్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రాజు యాదవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 22 నుంచి గెటప్ శీను సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

వరుణ్వి క్రియేషన్స్ పతాకంపై రాజేష్ కల్లేపల్లి ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ఆనంద చక్రపాణి, రూపాలక్ష్మి, ఉన్నతి, ఉత్తర ప్రశాంత్, సంతోష్ రాజ్, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ‘రాజు యాదవ్’ సినిమా కథ విషయానికి వస్తే.. రాజు యాదవ్ (గెటప్ శీను()‌ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో సర్జరీ చేయాల్సి వస్తుంది. అది కాస్తా వికటించి రాజు ముఖం నిత్యం నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. అదే సమయంలో అతనికి స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకు హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఆ తర్వాత స్వీటీ.. రాజుకు కొన్ని షాకులిస్తుంది. మరి చివరకు వీరి ప్రేమ కథ ఏమైందనేదే రాజు యాదవ్ సినిమా కథ.

రాజు యాదవ్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!