Allu Arjun: అల్లు శిరీష్‌కు మద్దతుగా పుష్పరాజ్.. ఊర్వశివో రాక్షసివో సక్సెస్ సెలబ్రెషన్స్‌కు అతిథిగా అల్లు అర్జున్..
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో.. రాక్షసివో సినిమా నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ అల్లు శిరీష్ తాజాగా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ రాకేష్ శని దర్శకత్వంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో.. రాక్షసివో సినిమా నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. టీజర్, ట్రైలర్‌తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు అందుకు తగినట్టుగానే మంచి వసూళ్లు రాబడుతుంది. అయితే వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. రిలీజ్ ఆలస్యమైనా.. రిజల్డ్ మాత్రం ఊహించినదానికంటే ఎక్కువగానే వస్తుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరుపనున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అలాగే ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.




ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
???? ???? @alluarjun garu to grace the ???????? ??????????? celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. ?@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi
— Geetha Arts (@GeethaArts) November 5, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
