Allu Arjun Arrest: ఇదిగో సంధ్య థియేటర్ ఆ రోజు పంపిన లేఖ.. అంతా బయటకు వచ్చిందిగా
అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చిక్కడపల్లి తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ అవ్వడం ఈ రోజు బ్యానర్ ఐటం అయింది. ఇక ఈ కేసులో పోలీసుల వెర్షర్ ఒకలా ఉంటే.. థియేటర్ వెర్షన్ మరోలా ఉంది....
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ లేఖ ఆసక్తిగా మారింది. ఈనెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ముందుగానే సీపీకి సంధ్య థియేటర్ లేఖ రాసింది. రాత్రి 9.30కి హీరో, హీరోయిన్ సహా వీఐపీలు వఇస్తున్నారని లేఖ మెన్షన్ చేసింది. అవసరమైన పోలీసు బందోబస్తు కోరుతూ థియేటర్ యాజమాన్యం లేఖ రాసింది.
ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే… ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు… ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని… అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్య థియేటర్ దగ్గర తోపులాట జరిగిందని చెబుతున్నారు. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు ముందు నుంచి వినిపిస్తున్న వర్షన్. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణలో మున్ముందు ఎలాంటి ట్విస్ట్‌లు తెరపైకి వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఇది పరిస్థితి…
అల్లు అర్జున్ ఇంటి దగ్గర హడావుడి కనిపిస్తుంది. మోగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు ఇంటికి క్యూ కట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్‌తో షూటింగ్ రద్దు చేసుకున్న చిరంజీవి… హుటాహుటిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. అటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు బన్నీ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా చేరుకొని భద్రత ఏర్పాటు చేశారు.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తంచేశారు. తీసుకెళ్లడం తప్పుకాదు.. అరెస్టు చేయడం తప్పుకాదు. కానీ డైరెక్ట్‌గా బెడ్ రూమ్‌లోకి వచ్చేస్తారా..? దిస్ ఈజ్ టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా? కనీసం డ్రెస్ కూడా మార్చుకునే టైమ్ ఇవ్వరా..? అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఉన్నపళంగా రావాలంటూ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆమెను అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కడంతో బన్నీ వద్దని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేసి… రిమాండ్ రిపోర్డ్ రెడీ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.