Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌- బెయిల్.. అసలు ఉదయం నుంచి ఏం జరిగిందంటే..

అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్‌పై 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు, నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5-10 ఏళ్లు జైలు శిక్షపడే ఛాన్స్.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌- బెయిల్.. అసలు ఉదయం నుంచి ఏం జరిగిందంటే..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2024 | 6:54 PM

సంధ్య థియేటర్‌ ఘటనలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ప్రకంపనలు రేపుతోంది. ఉదయం 11గంటల 45నిమిషాలకు హైదరాబాద్‌ పోలీసులు అల్లు అర్జున్‌ ఇంటికెళ్లారు. ఆ తర్వాత అరెస్ట్‌ చేస్తున్నట్లు ఆయనకు చెప్పారు. అయితే.. పోలీసుల తీరును అల్లు అర్జున్‌ ఖండించారు. బెడ్రూమ్‌లోకి వచ్చేస్తారా అంటూ నిలదీశారు. దాంతో.. తొక్కిసలాట కేసు గురించి పోలీసులు.. అల్లు అర్జున్‌తో చర్చించారు.

12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రాగానే ఆమె టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో.. స్నేహారెడ్డి భుజం తట్టి ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లే సమయంలో స్నేహారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

ఇక.. మధ్యాహ్నం ఒంటి గంటకు చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో హాజరు పరచడంతోపాటు రిమాండ్‌ రిపోర్ట్ రెడీ చేశారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అల్లు అర్జున్‌కు వైద్యులు పరీక్షలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆ తర్వాత.. అల్లు అర్జున్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. సరిగ్గా 4 గంటలకు నాంపల్లి కోర్టులో విచారణ చేపట్టారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక బెయిల్ కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు అల్లు అర్జున్. దాని పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. కానీ హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను క్యాన్సిల్ చేసింది. దాంతో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా చివరి నిమిషంలో అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలి అని ఆదేశించింది. కాగా అల్లు అర్జున్‌కి మద్దతుగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలబ్రెటీలతో పాటూ రాజకీయనాయకులు కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.