Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టులో బిగ్ ట్విస్ట్.. మృతురాలు రేవతి భర్త సంచలన ప్రకటన
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పుడు ఇదే కేసు విషయమై సంచలన ప్రకటన చేశాడు మృతురాలు రేవతి భర్త భాస్కర్.
పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద బన్నీపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న నటుడిని అరెస్ట్ చేసిన తీరు సరికాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి భర్త భాస్కర్ సంచలన ప్రకటన చేశాడు. అవసరమైతే తాను ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని మీడియాతో వెల్లడించాడు. రేవతి మృతికి, అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. వెంటనే అరెస్టైన బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆరోజు అల్లు అర్జున్ తో పాటు చాలామంది థియేటర్ కు వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు.
కాగా అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ ను కోర్టు కోట్టివేసింది. అలాగే బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. కాగా బన్నీ అరెస్టును పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఖండిస్తున్నారు. బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, అలాగే బీజేపీ నాయకులు బండి సంజయ్, రాజాసింగ్ తదితర పొలిటికల్ లీడర్లు బన్నీ అరెస్టును ఖండించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా బన్నీకి సపోర్టుగా మాట్లాడారు. బన్నీ త్వరగా బయటకు రావాలని అతను ఆకాంక్షించాడు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
రేవతి భర్త భాస్కర్ స్టేట్మెంట్.. వీడియో
అల్లు అర్జున్ కు మద్దతుగా వరుణ్ ధావన్..
Actor Varun Dhawan defends Allu Arjun over ‘Pushpa 2’ stampede tragedy: He said, “I’m very sorry. Sending my condolences. But at the same time I think aap blame sirf ek insaan pe nahi daal sakte #AlluArjunArrested #AlluArjunArrest #AlluArjun𓃵 #Stampede #Hyderabad #AlluArjun pic.twitter.com/exGmMj14au
— Vikas Bailwal (@VikasBailwal4) December 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.