Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: నేనేదో సరదాగా అంటే లావణ్య త్రిపాఠి మా వాడిని నిజంగానే ప్రేమించింది: అల్లు అరవింద్

మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బేబీ సినిమా లోని కొన్ని రఫ్ సీన్స్ చూశానని చాలా బాగున్నాయి అన్నారు. దర్శకుడు రాజేష్ సూపర్ ఎమోషనల్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకోచ్చాడని దర్శకుడుపై ప్రశంసలు కురిపించారు.

Allu Aravind: నేనేదో సరదాగా అంటే లావణ్య త్రిపాఠి మా వాడిని నిజంగానే ప్రేమించింది: అల్లు అరవింద్
Allu Aravind
Follow us
S Navya Chaitanya

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 13, 2023 | 7:35 PM

సాయి రాజేష్, దర్శకత్వంలో బేబీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్ లు ఒక రేంజ్ లో పాజిటివిటిని అందుకున్నాయి. అయితే జులై 14న ఈ సినిమా థియేటర్లల్లో ఆడనుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బేబీ సినిమా లోని కొన్ని రఫ్ సీన్స్ చూశానని చాలా బాగున్నాయి అన్నారు. దర్శకుడు రాజేష్ సూపర్ ఎమోషనల్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకోచ్చాడని దర్శకుడుపై ప్రశంసలు కురిపించారు.

ఈ నేపథ్యంలో ఇక లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లవ్ స్టోరీ పై సరదాగా కామెంట్స్ చేశారు అల్లు అరవింద్. గతంలో లావణ్య త్రిపాఠి పెళ్లి పై అల్లు అరవింద్ చెప్పిన వ్యాఖ్యలను యాంకర్ గుర్తు చేయడంతో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు బాగా మాట్లాడుతున్నావు ఇక్కడి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని నేనేదో సరదాగా అంటే.. ఆ అమ్మాయి మా వాడినే పెళ్లి చేసుకుంటుంది. అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడని వెంటనే విజయ్ దేవరకొండకు కాల్ చేసి మీ తమ్ముడు ఇరగదీశాడు అని వెంటనే చెప్పాను అని అన్నారు. ఇక బేబీ మూవీ 14న రిలీజ్ అవ్వనుంది.