Pawan kalyan-Ali: పవన్‌తో విభేదాలపై అలీ కామెంట్స్.. ఆయనకు నాకు గ్యాప్ రాలేదు.. కానీ వాళ్ళు..
పవన్ కళ్యాణ్ ఫ్యామిలితో అలికి మంచి అనుభందం ఉంది. ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం ఏర్పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అలీకి ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు మంచి మిత్రులు. పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాలో అలీ ఉన్నారు. ఒకానొక సందర్భంలో అలీ నా అన్ని సినిమాల్లో ఉండాలని పవన్ సూచించినట్టు కూడా టాక్ ఉంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యామిలితో అలీకి మంచి అనుభందం ఉంది. ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం ఏర్పడింది. పవన్ జనసేన పార్టీకాదని అలీ వైసీపీలో జాయిన్ అవ్వడం పై పవన్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడంతో అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. రాజకీయపరంగా ఎన్ని గొడవలున్న స్నేహాన్ని వదులుకోవద్దు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీ కూతురి వివాహానికి పవన్ హాజరు కాలేదు. అయితే దీనిపై అలీ వివరణ ఇచ్చినా కూడా అది ఫ్యాన్స్ కు అంత సంతృప్తికరంగా అనిపించలేదు.
తాజాగా అలీ పవన్ కు తనకు మధ్య వచ్చిన ఆ గ్యాప్ గురించి మాటలాడారు. అలీ ఓ ప్రముఖ ఛానల్ లో టాక్ షో నివహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో లేటెస్ట్ సీజన్ చివరి ఎపిసోడ్ కు గెస్ట్ గా యాంకర్ సుమ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమ అలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
అయితే సుమ అలీని ప్రశ్నలు అడుగుతుబ్ మీకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగింది. దానికి అలీ సమాధానం చెప్తూ.. నాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ రాలేదు..కొంతమంది గ్యాప్ క్రియేట్ చేశారు అని అన్నారు. దాంతో ఇప్పుడు ఆ గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరు అన్నది ఆసక్తికర చర్చ మొదలైంది. మరి దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.