Unstoppable with NBK2: అందరు హీరోలు ఓకే.. మరి మా హీరోతో ఎప్పుడు.? తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
ఇప్పుడు అనియీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను కూడా మొదలు పెట్టేశారు. ఇదిలా ఉంటే మరో వైపు అన్ స్టాపబుల్ షో ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఇక అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య..
నటసింహం నందమూరి బాలకృష్ణ అటు సినిమాలతో ఇటు అన్ స్టాపబుల్ టాక్ షో తో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు బాలయ్య. ఇప్పుడు అనియీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను కూడా మొదలు పెట్టేశారు. ఇదిలా ఉంటే మరో వైపు అన్ స్టాపబుల్ షో ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఇక అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2ని కూడా అదే ఎనర్జీ తో ఇప్పుడు సీజన్ 2ని రన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు యంగ్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యి సందడి చేశారు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టాట్ ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ కు హాజరయ్యాడు. తన మిత్రుడు గోపీచంద్ తో కలిసి ప్రభాస్ అన్ స్టాపబుల్ కు హాజరయ్యాడు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమ అభిమాన హీరోను ఎప్పుడు ఈ షోకు పిలుస్తారని ప్రశ్నిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బాలయ్య షోకు తారక్ రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తారక్ తో కలిసి బాలకృష్ణ సందడి చేస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మా హీరోని బాలయ్య షోకి ఎప్పుడు పిలుస్తారు అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు తారక్ త్వరలోనే అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా వస్తాడేమో చూడాలి.
ఇక బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లిమ్ప్స్, పాటలు సినిమా పై అంచనాలను క్రియేట్ చేశాయి. అటు తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.