Sushanth: అక్కినేని యంగ్ హీరో ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవి సినిమా పైనే..
హీరోగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో సెకండ్ హీరో పొజీషన్ కు మారిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతో సుశాంత్ కు మంచి మార్కులు పడ్డాయి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోల్లో సుశాంత్ ఒకరు కరెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్. ఆతర్వాత వారుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో సెకండ్ హీరో పొజీషన్ కు మారిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతో సుశాంత్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో సుశాంత్ మళ్లీ నిరాశపడక తప్పలేదు. ఇక ఇప్పుడు మరో భారీ మూవీలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు సుశాంత్. మెహర్ రమేష్ దార్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తమిళ్ మూవీ వేదలమ్ కు రీమేక్. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనున్నారు. అలాగే సుశాంత్ ఈ సినిమాలో తమన్నా అన్నగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా పైనే సుశాంత్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ అయితే సుశాంత్ కు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అలాగే సోలో హీరోగానూ ట్రై చేస్తున్నాడు సుశాంత్. మరి సుశాంత్ కెరీర్ లో భోళాశంకర్ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.




