AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayendra Prasad: సీఎం కేసీఆర్ మిరాకిల్‌ క్రియేట్‌ చేశారు.. నూతన సచివాలయంపై విజయేంద్ర ప్రసాద్‌ ప్రశంసల వర్షం

తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను మనకు అందించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ఆయన కేసీఆర్‌ సర్కారును కొనియాడారు.

Vijayendra Prasad: సీఎం కేసీఆర్ మిరాకిల్‌ క్రియేట్‌ చేశారు.. నూతన సచివాలయంపై విజయేంద్ర ప్రసాద్‌ ప్రశంసల వర్షం
Vijayendra Prasad
Basha Shek
|

Updated on: May 19, 2023 | 11:10 AM

Share

అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలంగాణ సీఎంపై ప్రశంసలు కురిపించారు. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను మనకు అందించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ఆయన కేసీఆర్‌ సర్కారును కొనియాడారు. ఇప్పుడే ఒక అద్భుతం చూసాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు స్వయంగా చూసాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్ లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేసారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్‌ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు.. అది ఆయనకే సాధ్యం. తన పట్టుదల, ఆకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేస్తూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి నిజం చేశారు. కేవలం పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నా’ అంటూ హర్షం వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్‌.

ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్‌ వెంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్‌ రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు ఉన్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సూపర్ స్టార్‌ రాజమౌళితో సినిమా తీస్తున్నారు రాజమౌళి. విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ని కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..