Akkineni Nagarjuna: చార్మింగ్ లుక్‏లో అదిరిపోయిన నాగార్జున.. ఈ వయసులోనూ అంత హ్యాండ్సమ్స్ ఏంటీ కింగ్..

ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు ప్రసన్న కుమార్. ఇందులో ఇద్దరు యువ హీరోలు కీలకపాత్రలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.

Akkineni Nagarjuna: చార్మింగ్ లుక్‏లో అదిరిపోయిన నాగార్జున.. ఈ వయసులోనూ అంత హ్యాండ్సమ్స్ ఏంటీ కింగ్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2023 | 12:42 PM

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటించిన ఘోస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాగ్ తదుపరి సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు ప్రసన్న కుమార్. ఇందులో ఇద్దరు యువ హీరోలు కీలకపాత్రలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియాలో నాగ్ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇటు సోషల్ మీడియాలోనూ నాగ్ ఎలాంటి అప్డేట్స్ షేర్ చేయలేదు. తాజాగా నాగ్ లేటేస్ట్ లుక్ ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది.

చాలా రోజుల తర్వాత నాగార్జున ఛార్మింగ్ అండ్ స్టైలీష్ లుక్ లో కనిపించారు. గడ్డంతో బ్లూషర్ట్ లో నాగ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో నాగ్ ఈ తరహా డిఫరెంట్ లుక్ లో కనిపిచడం ఇదే తొలిసారి. తాజాగా నాగ్ కనిపించిన లుక్ చూస్తే ..ఆయన తదుపరి సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నాగార్జున్ న్యూలుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమ అభిమాన హీరోను ఇలా కొత్త అవతారంలో చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. చాలా కాలం మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారని.. ఈ వయసులోనూ అంత హ్యాండ్సమ్ ఏంటీ బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.