Samantha: అల్లు అర్హ నటనపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పుట్టుకతోనే సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు..

ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతలు సమంత భూజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేడుకలలో పాల్గొంటున్నారు సామ్.

Samantha: అల్లు అర్హ నటనపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. పుట్టుకతోనే సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు..
Samantha, Allu Arha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2023 | 12:09 PM

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో..మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు గుణశేఖర్ తనయ నీలిమ గుణ. ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతలు సమంత భూజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేడుకలలో పాల్గొంటున్నారు సామ్.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ గౌతమి, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతోనే అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇందులో సెకండ్ హాఫ్ లో వచ్చే భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. ఈ క్రమంలో అర్హ నటనపై సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మొదటి రోజు చిత్రీకరణలో దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య అర్హ ఫర్ఫామెన్స్ చేయాల్సి వచ్చిందని.. అంతమంది మధ్య ఉన్న కూడా అర్హ మాత్రం ఎలాంటి భయం లేకుండా పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా ఫర్ఫెక్ట్ గా చెప్పిందని అన్నారు. అర్హకు ఇంగ్లీష్ అంతగా రాదని.. తెలుగులో డైలాగ్ డెలివరీ అద్బుతంగా చెప్పిందన్నారు. అర్హని చూసిన తర్వాత పుట్టుకతోనే సూపర్ స్టార్ అనే బ్రాండ్ కు కరెక్ట్ గా సూటబుల్ అవుతుందని అనిపించిందంటూ అర్హ నటనపై ప్రశంసలు కురిపించింది సామ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ కామెంట్స్ చూసిన అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ అభిమాన హీరో కూతురు నటించిన మొదటి సినిమాను చూసేందుకు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ సినిమాను తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు.