Keerthy Suresh: మందుకన్నా బ్రేకప్ చేదుగా ఉంటుంది.. వైరలవుతున్న కీర్తి సురేష్ కామెంట్స్..
పలు ఇంటర్వ్యూలలో సినిమా గురించి మాత్రమే కాకుండా.. తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాని నాని అండ్ కీర్తి సురేష్. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, బ్రేకప్ గురించి కీర్తి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నారు. బ్రేకప్ చేదుగా ఉంటుందని చెప్పి షాకిచ్చింది కీర్తి.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్.. న్యాచురల్ స్టార్ నాని జంటగా నటిస్తోన్న చిత్రం దసరా. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలలో సినిమా గురించి మాత్రమే కాకుండా.. తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాని నాని అండ్ కీర్తి సురేష్. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, బ్రేకప్ గురించి కీర్తి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నారు. బ్రేకప్ చేదుగా ఉంటుందని చెప్పి షాకిచ్చింది కీర్తి.
ప్రేమలో ఓడినవారికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందో వారు మాత్రమే చెప్పగలరు. లవ్ ఫెయిల్ అయిన హీరోయిన్స్ తమ బాధను సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. గతం నుంచి పారిపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇటీవల బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇది చాలా సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. బ్రేకప్ చేదుగా ఉంటుందా ?.. మందు చేదుగా ఉంటుందా ? అని ప్రశ్నించగా.. మొదట్లో సముచాయించినా.. ఆ తర్వాత బ్రేకప్ మాత్రమే చేదుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కీర్తి అంతగా ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కీర్తి సినిమాల కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అనేక వార్తలు నెట్టింట వైరలయ్యాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కీర్తి ప్రేమలో ఉందని టాక్ నడిచింది. ఆ తర్వాత కొద్ది రోజులకు.. తన చిన్ననాటి స్నేహితుడితో త్వరలోనే కీర్తి ఏడడుగులు వేయబోతున్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. ఈక్రమంలోనే తాజాగా బ్రేకప్ గురించి కీర్తి చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.