Naa Saami Ranga: మాస్ లుక్‏లో నాగార్జున.. ఆషికా అదరగొట్టేశారు.. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వీడియో చూశారా ?.

నా సామిరంగ సినిమాలో నాగ్ సరసన కన్నడ భామా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ చేస్తోన్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు డాన్స్ మాస్టర్ అయిన విజయ్.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

Naa Saami Ranga: మాస్ లుక్‏లో నాగార్జున.. ఆషికా అదరగొట్టేశారు.. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వీడియో చూశారా ?.
Naa Saami Ranga
Follow us

|

Updated on: Dec 10, 2023 | 6:06 PM

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చాలా కాలం తర్వాత నటిసోన్న సినిమా ‘నా సామిరంగ’. ఘోస్ట్ సినిమా తర్వాత కొంచం గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా ఇది. అంతేకాదు సా సామిరంగ అంటూ టైటిల్ అనౌన్స్ చేసి కొత్త లుక్‏లో అభిమానులను ఆశ్చర్యపరిచారు నాగ్. ఫుల్ గడ్డం.. పెద్ద జుట్టు.. మీసాలతో మాస్ లుక్‏లో కనిపించి షాకిచ్చారు. నా సామిరంగ సినిమాలో నాగ్ సరసన కన్నడ భామా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ చేస్తోన్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు డాన్స్ మాస్టర్ అయిన విజయ్.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో నాగ్ లుక్ చూస్తుంటే.. ఈసారి ప్రేక్షకులకు మరింత ఊర మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటూ సాగే పాటను అడియన్స ముందుకు తీసుకువచ్చారు.

“బెల్లం చెరకు చూపులదానా.. అల్లం మిరప మాటలదానా.. బొండు మల్లి నడుముదానా.. బండెడు సోకుల ఓ నెరజాణ.. నువ్వుట్టా పోతుంటే.. నిన్నట్టా సూతుంటే.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే..” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ పాటలో చూపించిన విలేజ్ బ్యాగ్రౌండ్ విజువల్స్ చూస్తుంటే ఈసారి ప్రేక్షకులకు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈపాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.