Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడే హార్మోనియం వాయిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఫేమస్ సింగర్.. ఆమె గాత్రానికి ముగ్దులవ్వాల్సిందే..

ఆమె స్వరం ప్రేమను పంచుతుంది.. ప్రశాంతతను అందిస్తుంది. మనసుకు ఓదార్పునిస్తుంది. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది. ఆమె గళం ఎంతో మంది సంగీత ప్రియుల మనసులను దొచుకుంది. సంగీతానికి భాష ముఖ్యం కాదు.. భావమే ముఖ్యమంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అన్ని భాషలలోనూ ఆమె ఎన్నో పాటలు పాడారు. ఇప్పటికీ తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మైమరపిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: చిన్నప్పుడే హార్మోనియం వాయిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఫేమస్ సింగర్.. ఆమె గాత్రానికి ముగ్దులవ్వాల్సిందే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2023 | 5:34 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఫేమస్ సింగర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అద్భుతమైన గాత్రం ఆమె సొంతం. ఆమె స్వరం ప్రేమను పంచుతుంది.. ప్రశాంతతను అందిస్తుంది. మనసుకు ఓదార్పునిస్తుంది. నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది. ఆమె గళం ఎంతో మంది సంగీత ప్రియుల మనసులను దొచుకుంది. సంగీతానికి భాష ముఖ్యం కాదు.. భావమే ముఖ్యమంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అన్ని భాషలలోనూ ఆమె ఎన్నో పాటలు పాడారు. ఇప్పటికీ తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మైమరపిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ఫేమస్ సింగర్ శ్రేయా ఘోషల్. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శ్రేయా ఘోషల్.. దాదాపు భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులందరితో కలిసి పనిచేసింది.

బెంగాలీ కుటుంబంలో జన్మించిన శ్రేయా ఘోషల్.. రాజస్థాన్‌లోని రావత్‌భటా, కోట సమీపంలోని ఒక చిన్న పట్టణంలో పెరిగారు. నాలుగేళ్ల వయసులోనే హార్మోనియం వాయించడం నేర్చుకుంది. చిన్న వయసులోనే ఆమెను మహేశ్‌చంద్ర శర్మ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణ కార్యక్రమంలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు. పదహారేళ్ల వయసులో టెలివిజన్ సింగింగ్ రియాల్టీ షో స రే గా మా పోటీల్లో పాల్గొని గెలిచింది. ఆ తర్వాత డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తరెకెక్కించిన ప్రేమకథ దేవదాస్ (2002) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా ప్రయాణం ప్రారంభించింది. ఈ సినిమాకుగానూ.. ఆమె జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో పాటలు ఆలపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలోని నువ్వేం మాయ చేసావో గానీ.. సాంగ్ ఆమె మొదటి తెలుగు పాట. ఇప్పటివరకు ఆమె పాడిన పాటలకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. మలయాళం, తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 2010లో ఇంగ్లీష్ సినిమా వెన్ హేరీ ట్రైస్ టు మెరీ సినిమాలోనూ ఆమె పాట పాడారు. ఇప్పటికీ నార్త్.. సౌత్ సినిమాల్లో తన గాత్రంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది శ్రేయా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.