తొలి ముద్దు ఆమెకే ఇచ్చా.. జీవితంలో మర్చిపోలేను.. అసలు విషయం చెప్పిన నాగచైతన్య
నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత, శోభితతో ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు వాటినే నిజం చేస్తూ.. 2024 డిసెంబర్‌లో చైతూ శోభితన రెండో వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత చైతూ తండేల్ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో అందరూ, శోభితా అడుగు పెట్టిన వేళా విశేషం చైతూ సూర్ హిట్ అందుకున్నారంటూ చెప్పుకొచ్చారు.

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య. తండేల్ రాజుగా అద్భుతంగా నటించి మెప్పించాడు నాగ చైతన్య. ఇక ఈ అక్కినేని అందగాడి పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. నాగ చైతన్య మొదటి స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆతర్వాత ఈ ఇద్దరూ ఊహించని విధంగా విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆతర్వాత చాలా కాలం ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయ్యేరు.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
అయితే నాగ చైతన్య సామ్ తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ తమ రిలేషన్ ను చాలా రోజులు సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత, చైతూ తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికీ ఇచ్చాడో తెలిపాడు. శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించారు. మొదటి ముద్దు ఎప్పుడు.? ఎవరికి పెట్టావో గుర్తుందా..? అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఆసక్తికర సమాధానం చెప్పారు. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్ద ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య తెలిపారు. ఆ ముద్దు నా జీవితమంతా పని చేసింది అని చైతు అన్నారు. అలాగే ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..