భారత్-యుఏఈ ఉమ్మడి సైనిక విన్యాసం.. ‘డెజర్ట్ సైక్లోన్-II’తో దుమ్మురేపిన త్రివిధ దళాలు
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రదాడులను తిప్పికొట్టే విషయంలో అనుసరించే వ్యూహాలపై ప్రధానంగా ఈ విన్యాసాల్లో దృష్టి పెట్టారు. భారత్-యూఏఈ దేశాలు 'డెజర్ట్ సైక్లోన్-II' పేరుతో నిర్వహించిన సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య సైనిక బంధాన్ని బలోపేతం చేశాయి.

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉగ్రదాడులను తిప్పికొట్టే విషయంలో అనుసరించే వ్యూహాలపై ప్రధానంగా ఈ విన్యాసాల్లో దృష్టి పెట్టారు. భారత్-యూఏఈ దేశాలు ‘డెజర్ట్ సైక్లోన్-II’ పేరుతో నిర్వహించిన సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య సైనిక బంధాన్ని బలోపేతం చేశాయి. ‘డెజర్ట్ సైక్లోన్-II’ అల్-హమ్రా శిక్షణ నగరంలో నిర్వహించారు.
డిసెంబర్ 18 నుండి 30, 2025 వరకు యుఎఇలోని అబుదాబిలో రెండు దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఇది భారత్-యుఎఇ ఉమ్మడి సైనిక విన్యాసం రెండవ ఎడిషన్. ఇది రెండు సైన్యాల మధ్య సమన్వయం, నమ్మకం, ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో భద్రత, UN శాంతి పరిరక్షణ కార్యకలాపాల కోసం నిర్వహించారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో యుద్దతంత్రం, IED రక్షణ, గాయపడిన వారి తరలింపు, ప్రథమ చికిత్స లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.
అలాగే హెలికాప్టర్ కార్యకలాపాలు, వైమానిక దాడి, ప్లాటూన్-స్థాయి ఉమ్మడి దాడి విన్యాసాలు కూడా నిర్వహించారు. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ నుంచి 45 మంది ది భారత ఆర్మీ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. యుఎఇ ఆర్మీకి చెందిన 53వ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ కూడా విన్యాసాల్లో పాల్గొంది.
‘డెజర్ట్ సైక్లోన్-II’ డ్రిల్ భారత్-యుఎఇ మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసింది. ఇది భవిష్యత్తులో ఉమ్మడి, బహుళజాతి కార్యకలాపాలలో కలిసి పనిచేసే రెండు సైన్యాల సామర్థ్యాన్ని మరింత పెంచింది. భారత్- యూఏఈ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇది రెండోసారి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేందుకు రెండు దేశాల మధ్య డిఫెన్స్ డీల్‌కు సిద్దమవుతున్నాయి. దుబాయ్ పర్యటనలో ప్రధాని మోదీ గతంలోనే కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
