AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి.. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. !

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు వేరే మార్గం లేదన్నారు. లొంగిపోయిన తరువాత ఇరాన్‌తో చర్చల విషయం ఆలోచిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, నాయకత్వాన్ని మార్చిన తరువాత ఇరాన్‌ను సమర్ధవంతమైన దేశంగా మారుస్తామని ప్రకటించారు.

ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి.. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. !
Us President Donald Trump Key Statement On Iran War
Balaraju Goud
|

Updated on: Mar 06, 2026 | 8:13 PM

Share

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు వేరే మార్గం లేదన్నారు. లొంగిపోయిన తరువాత ఇరాన్‌తో చర్చల విషయం ఆలోచిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, నాయకత్వాన్ని మార్చిన తరువాత ఇరాన్‌ను సమర్ధవంతమైన దేశంగా మారుస్తామని ప్రకటించారు. ఇరాన్‌ భవిష్యత్‌ చాలా బాగుంటుందని, ఆదేశ గౌరవాన్ని తిరిగి కాపాడుతామని ట్రంప్‌ అన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. మరోసారి ఇరాన్‌ను తీవ్రంగా బెదిరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, ఇది దాని ప్రయోజనాల కోసమేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆయుధాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో లొంగిపోవడం తప్ప మరే ఒప్పందం కుదుర్చుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్ గురించి డోనాల్డ్ ట్రంప్ ఏమి చెప్పారు?

ఇరాన్‌తో చర్చలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి, ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ సైనిక చర్య ఫిబ్రవరి 28న ప్రారంభమైంది, ఫలితంగా వందలాది మంది మరణించారు. ఇంతలో, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. వారి వైమానిక రక్షణ, వైమానిక దళం, నావికాదళం నాయకత్వం పూర్తిగా పోయాయని ట్రంప్ అన్నారు.

ఇదిలావుంటే, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులకు ఇరాన్ ధీటుగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, వైమానిక స్థావరాలపై ఇరానియన్ డ్రోన్లు దాడి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నష్టం భారీగానే వాటిల్లింది. కాగా, చాలా కాలంగా కుదుపుకు గురైన ఉద్రిక్తతలు ఫిబ్రవరి 28, 2026న అకస్మాత్తుగా యుద్ధంగా మారాయి. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించి ఇరాన్‌పై దాడి చేశాయి. ఇజ్రాయెల్ F-35లు, US B-2 బాంబర్లు ఇరాన్ అణు స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌పై లదాడులు చేశాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us