Agent: అవాక్ చేస్తోన్న అఖిల్ అక్కినేని.. మేకింగ్ వీడియో చూస్తే మతిపోవాల్సిందే
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం లుక్ మొత్తం మార్చేశాడు అఖిల్. వర్కౌట్స్ చేసి కండలు పెంచి బీస్ట్ లుక్ లోకి వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం లుక్ మొత్తం మార్చేశాడు అఖిల్. వర్కౌట్స్ చేసి కండలు పెంచి బీస్ట్ లుక్ లోకి వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్లను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను నిర్మిస్తున్న అనీల్ సుంకర ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు.
తాజాగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ.. ఏజెంట్ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సమ్మర్ 2023 అని పోస్టర్ లో వేసారు కానీ అధికారిక రిలీజ్ తేదీని అయితే ప్రకటించలేదు. ఈ మేకింగ్ వీడియోలో అఖిల్ మ్యాకోమ్యాన్ లుక్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ లా ఉంది.
ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇందులో అఖిల్ స్పై గా కనిపించబోతున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.