AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

200 కోట్ల మార్కు దాటిన ‘విశ్వాసం’

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంద‌ని తెలుస్తుంది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే ఈ చిత్రం 139 కోట్ల రూపాయల‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత త‌మిళ‌నాడులో ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఘ‌న‌త ఈ చిత్రానికి ద‌క్కింది. కోలీవుడ్‌లో జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 50 రోజులు […]

200 కోట్ల మార్కు దాటిన 'విశ్వాసం'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:01 PM

Share

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన తాజా చిత్రం విశ్వాసం. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంద‌ని తెలుస్తుంది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే ఈ చిత్రం 139 కోట్ల రూపాయల‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత త‌మిళ‌నాడులో ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఘ‌న‌త ఈ చిత్రానికి ద‌క్కింది.

కోలీవుడ్‌లో జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు 50డేస్ సెల‌బ్రేష‌న్స్‌ని పండుగ‌లా జ‌రుపుకున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో డ‌బ్బింగ్ వ‌ర్షెన్ విడుద‌ల కాగా, అక్క‌డ కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. విశ్వాసం చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.