Ajith Kumar: అజిత్ మంచి మనసు.. తోటి రైడర్‌కు బీఎండబ్ల్యూ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన తలా.. ఎన్ని లక్షలో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో వరల్డ్ బైక్ టూర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలోనే అజిత్ భారతదేశంలో తన బైక్ టూర్‌ను పూర్తి చేసిన అజిత్ తాజాగా నేపాల్, భూటాన్ దేశాల్లో బైక్ టూర్‌ను పూర్తి చేశారు. కాగా ఈ బైక్ టూర్‌లో అజిత్ వెంట సుగత్ సత్పతి అనే బైక్ రైడర్ కూడా పాల్గొన్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో వరల్డ్ బైక్ టూర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలోనే అజిత్ భారతదేశంలో తన బైక్ టూర్‌ను పూర్తి చేసిన అజిత్ తాజాగా నేపాల్, భూటాన్ దేశాల్లో బైక్ టూర్‌ను పూర్తి చేశారు. కాగా ఈ బైక్ టూర్‌లో అజిత్ వెంట సుగత్ సత్పతి అనే బైక్ రైడర్ కూడా పాల్గొన్నారు. ఆయనే అజిత్ నేపాల్ టూర్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేశారు. దీంతో అతనికి ఖరీదైన లగ్జరీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు అజిత్. బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ సూపర్ బైక్‌ను సుగత్‌కు కానుకగా ఇచ్చారు. దీని ఖరీదెంతో తెలుసా? అక్షరాల రూ.12.5 లక్షలు. కాగా అజిత్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు సుగత్. ఈ మేరకు తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ‘2022 సంవత్సరంలో నాకు అదృష్టం కలిసొచ్చింది. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని సూపర్ స్టార్లలో ఒకరైన అజిత్ కుమార్‌ను కలిశాను. ఆయనకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్ బైక్‌ను కూడా మంచి క్లాస్‌గా డ్రైవ్ చేస్తారు. ఆయన ఈశాన్య రాష్ట్రాల టూర్‌ను నేను ఆర్గనైజ్ చేశాను. అజిత్ వెంట నా పాత డ్యూక్ 390 బైక్‌తో వెళ్లాను. అది పూర్తయ్యాక నేపాల్, భూటాన్ టూర్ కూడా నాతోనే చేస్తానని చెప్పారు. అది అజిత్ వరల్డ్ టూర్ ప్లాన్‌లో భాగం. ఆ టూర్ మే 6వ తేదీన పూర్తయింది. ఈ రైడ్‌లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూశాం ‘ అని సుగత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాసుకొన్నాడు.
ఇక అజిత్ ఇచ్చిన సూపర్ బైక్‌ను చూపిస్తూ.. ‘ఈ బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ నాకెంతో ప్రత్యేకమైనది. దీన్ని అజిత్ బహుమతిగా ఇచ్చారు. దీనిని ఆయన నాకు ఎంతో ప్రేమగా ఇచ్చారు.ఈ అందమైన ఎఫ్850జీఎస్ నా దగ్గర ఉండాలని ఆయన అనుకున్నారు. దీంతో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయవచ్చు. నా జీవితంలో ఆయన పాత్ర గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన నన్ను ఒక అన్నలాగా చూసుకున్నారు. నువ్వు బెస్ట్ అన్నా’ అజిత్‌పై తనకున్న అభిమానానికి అక్షర రూపమిచ్చాడు సుగత్. ప్రస్తుతం అజిత్‌తో బైక్ రైడర్ దిగిన ఫొటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అజిత్ సార్ మంచి మనసును ప్రశంసిస్తూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.