AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

aha – OTT: ఆహా అందిస్తున్న మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌.. స్టాండప్ రాహుల్ రాబోతున్నాడు

కుర్రహీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

aha - OTT: ఆహా అందిస్తున్న మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌.. స్టాండప్ రాహుల్ రాబోతున్నాడు
Raj Tharun
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2022 | 6:11 PM

Share

Stand Up Rahul : కుర్రహీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో `స్టాండప్ రాహుల్` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌ ఈ మూవీ. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.

జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది. ఈ సినిమాలో అందాల భామ వర్ష బొలమ్మ హీరోయిన్ గా నటించింది. అలాగే  ఈ మూవీలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఏప్రిల్ 8, 2022 నుండి ఆహాలో ప్రీమియర్‌గా రాబోతుంది. ఆహాలో ఇటీవలే భీమ్లా నాయక్, డీజే టిల్లు, తెలుగు ఇండియన్ ఐడల్, సెబాస్టియన్, ఖుబూల్ హై?, అర్జున ఫాల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, 3 రోజెస్, మంచి రోజులోచై, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, అల్లుడు గారు, అలాగే క్రిస్మస్ తాత వంటివి అలరిస్తున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ఆహా టాక్ షో, అన్‌స్టాపబుల్,  IMDBలో 1 టాక్ షోగా నిలిచింది.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..