krithi shetty: ఉప్పెన బ్యూటీకి ఎగసిపడుతున్న ఆఫర్లు.. కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి..

తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ సూర్య కు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను

krithi shetty: ఉప్పెన బ్యూటీకి ఎగసిపడుతున్న ఆఫర్లు.. కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి..
Krithi Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2022 | 5:43 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya Sivakumar )కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ సూర్య కు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇటీవలే ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య.. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి నుంచి సూర్య విభిన్న కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం ‘శివపుత్రుడు’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు ,తమిళం లో మంచి పేరు రావడంతో ప్రేక్షకులలో ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి . ఈ చిత్రానికి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య మరియు జ్యోతిక నిర్మాత లు గా , రాజేశేఖర పాండియన్ సహా నిర్మాత గా వ్యవహరించనున్నారు.”నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని “హీరో సూర్య ట్వీట్ చేసారు.

సూర్య ని సరికొత్త గా ఒక డిఫరెంట్ రోల్ లో చూపించడానికి డైరెక్టర్ బాల ఒక యూనిక్,  ఉద్వేగభరితమైన కథ ని సిద్ధం చేసారు. “సూర్య41” చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని కన్యాకుమారిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రంలో సూర్య కి జోడీ గా నటించనుంది, సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతిశెట్టి ఈ సినిమాతో తమిళ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరి ఈ సినిమా ఏస్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

Bala

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!