Adivi Sesh’s Major : కరోనా ఎఫెక్ట్.. అడవి శేష్ ‘మేజర్’ మూవీ రిలీజ్ కూడా వాయిదా..!
కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది.. రోజు రోజుకు కేసుకు పెడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు.

Adivi Sesh’s Major : కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది.. రోజు రోజుకు కేసుకు పెడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ కు రెడీ అయినా సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తుంది. పలు భాషల్లోకి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అని భావించి బడా సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లానాయక్ లాంటి సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరో సినిమా కూడా ఇప్పుడు వెనక్కి తగ్గింది. కుర్ర హీరో అడవిశేష్ నటిస్తున్న మేజర్ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు చిత్రయూనిట్.
ప్రస్తుతం ఉన్న పరిస్థితహుల్లో సినిమాను విడుదల చేయలేక పోతున్నాం అని తెలిపారు. మేజర్ సినిమా ఇండియా కోసం చేసిన సినిమా కాబట్టి దేశం లో పరిస్థితులు చెక్కబడిన తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ‘మేజర్’ టీజర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ‘మేజర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు, మలయాళంలో విడుదల కానుంది. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ ఏప్లస్ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన సినిమా మేజర్.
The release of #MajorTheFilm stands postponed owing to the pandemic.
The new release date would be announced at the earliest possible time.@AdiviSesh @saieemmanjrekar @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @zeemusicsouth pic.twitter.com/sQJd8cGA6D
— GMB Entertainment (@GMBents) January 24, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :




