Pawan Kalyan : తన రాబోయే సినిమాలకు కండీషన్ పెట్టిన పవర్ స్టార్.. అదేంటంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ గా వచ్చి అదరగొట్టిన పవన్.. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ గా వచ్చి అదరగొట్టిన పవన్.. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాగర్ చాంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో పాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.హరి హర వీరమల్లు అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ప్రియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు క్రిష్.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. వీటితోపాటు తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పావన కళ్యాణ్ తన రాబోయే సినిమాలకు ఓ కండీషన్ పెట్టినట్టు తెలుస్తుంది. తాను చేసే సినిమాలకు 60 రోజుల కాల్షీట్ మాత్రమే ఇస్తానని.. 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనీ పవన్ కండీషన్ పెట్టారట. పవన్ సినిమా అంటే అందులో ఆర్టిస్ట్ లు కూడా భారీగా ఉంటారు. మరి పవన్ ఇచ్చిన టైమ్ లో వారికి కూడా సెట్ అయ్యే డేట్లను ఫిక్స్ చేయడం కష్టంతో కూడుకున్న పనే.. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :