Adivi Sesh : అడవి శేష్ ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయనున్నాడా..?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Adivi Sesh : అడవి శేష్ ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయనున్నాడా..?
Adivi Shesh
Follow us

|

Updated on: Jul 21, 2022 | 8:32 AM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్(Adivi Sesh )ఒకరు. ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు శేష్. ఇటీవలే వచ్చిన మేజర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలుస్తోంది. అయితే శేష్ నటించిన గూఢచారి సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

గూఢచారి సినిమా సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఆ టాక్ నిజం కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం శేష్ హిట్ 2 సినిమా చేస్తున్నాడు. గతంలో విశ్వక్ సేన్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరి గూఢచారి సీక్వెల్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి