Vimala Raman: కోలీవుడ్ విలన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం..? బర్త్‌డే వేడుకల్లో ఇన్‌డైరెక్ట్‌గా..
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం 2, ఎవరైనా ఎప్పుడైనా.. వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నటి విమలారామన్ గుర్తుందా? ఈ అందాల భామ కోలీవుడ్ నటుడు వినయ్‌తో ప్రేమలో ఉన్నట్టు..
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం 2, ఎవరైనా ఎప్పుడైనా.. వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నటి విమలారామన్ గుర్తుందా? ఈ అందాల భామ కోలీవుడ్ నటుడు వినయ్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. జనవరి 23న విమలారామన్ 42వ పుట్టినరోజును ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తన తల్లిదండ్రులతో కలిసి జరుపుకుంది. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైంది. ఇంట్లో నా కుటుంబంతో గడపడం చాలా ఆనందంగా ఉందంటూ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఐతే విమలారామన్ బర్త్‌డే వేడుకల్లో నటుడు వినయ్ రాయ్ ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు కొన్ని నెలల క్రితం వినయ్, విమల డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి కూడా. ఐతే ఈ వార్తలపై వీరిరువురు స్పందించకపోవడం విశేషం.
‘డ్యామ్ 999’ సెట్స్‌లో తొలిసారిగా కలుసుకున్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్లు.. ఈ సారి నటి బర్త్‌డే వేడుకల్లో వినయ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుటుంబం అని సంబోధించడం ద్వారా తమ బంధాన్ని ధృవీకరించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వినయ్ ప్రస్తుతం విలన్ పాత్రల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘డీజిల్’ మువీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందించిన ‘పోయ్’ మువీతో విమలారామన్ కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.