Varsha Bollamma: నా వ‌య‌సు ఎంతో మా అమ్మ‌కంటే గూగుల్‌కే ఎక్కువ తెలిసుండాలి.. వ‌ర్ష బొల్ల‌మ్మ ఫ‌న్నీ ఆన్స‌ర్‌..

Varsha Bollamma: ఆనంద‌ర్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే రూపం, ఆక‌ట్టుకునే...

Varsha Bollamma: నా వ‌య‌సు ఎంతో మా అమ్మ‌కంటే గూగుల్‌కే ఎక్కువ తెలిసుండాలి.. వ‌ర్ష బొల్ల‌మ్మ ఫ‌న్నీ ఆన్స‌ర్‌..
Varsha
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 05, 2021 | 10:31 AM

Varsha Bollamma: ఆనంద‌ర్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించే రూపం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తోందీ బ్యూటీ. అతి త‌క్కువ స‌మ‌యంలో మ‌ల‌యాళం, త‌మిళంతోపాటు తెలుగులోనూ న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటుందీ బ్యూటీ. ఇక సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే వ‌ర్ష‌.. ఫ్యాన్స్‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌ధులిచ్చింది. ఆస్క్ మీ క్వ‌చ్చ‌న్ పేరుతో చేసిన ఈ సెషన్‌లో ఓ అభిమాని వ‌ర్ష వ‌య‌సు గురించి ప్ర‌స్తావించాడు. `గూగుల్‌లో మీ వ‌య‌సు 25 ఏళ్లు అని చూపిస్తోంది. ఇది నిజ‌మేనా` అని ప్ర‌శించాడు. దీంతో వ‌ర్ష ఈ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. `నేను 1996లో జ‌న్మించాను. ఈ లెక్క‌న నాకు ఇప్పుడు 24 ఏళ్లు. కానీ నా వ‌య‌సు గురించి మా అమ్మ‌కంటే గూగుల్‌కే ఎక్కువ‌గా తెలిసిన‌ట్లుంది` అంటూ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇచ్చింది. ఇక చివ‌రిలో ప్ర‌స్తావిచిన గూగుల్ రాక్స్ అనే యాష్ ట్యాగ్ న‌వ్వులు పూయిస్తోంది.

Varsha 1

Varsha 1

Also Read: స్టార్ హీరోల సరసన కాకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మ..

Sai Dharam Tej: మెగా హీరో సినిమాకు వీడని కరోనా కష్టాలు… ఓటీటీ వైపు సాయి ధరమ్ తేజ్ మూవీ… ( వీడియో )

Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానున్న చందమామ.. హారర్ థ్రిల్లర్ గా ‘ఉమ’