Mahesh Babu: ఆ యంగ్ హీరోయిన్ మహేష్ సినిమాకు నో చెప్పిందా ?.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..
ఈ సినిమాలో ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే పూజ చెల్లెలి క్యారెక్టర్ లో శ్రీలీల నటించనున్నదని టాక్.
సర్కారు వారి పాట సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత ప్రిన్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఆగస్ట్ నెలలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి పలు అప్డేట్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే పూజ చెల్లెలి క్యారెక్టర్ లో శ్రీలీల నటించనున్నదని టాక్. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం శ్రీలీల మహేష్ సినిమా నుంచి తప్పుకుందట. ఇందులో మహేష్ మరదలి పాత్రలో శ్రీలీల కనిపించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తనకు మెయిన్ హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడం మంచిది కాదని శ్రీలీల మహేష్, త్రివిక్రమ్ సినిమాను రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ప్రస్తుతం మాస్ మాహారాజా సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.