AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఏజెంట్ టీజర్ పై సూపర్ స్టార్ ఆసక్తికర ట్వీట్.. ధన్యవాదాలు చెప్పిన అఖిల్..

ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ,

Mahesh Babu: ఏజెంట్ టీజర్ పై సూపర్ స్టార్ ఆసక్తికర ట్వీట్.. ధన్యవాదాలు చెప్పిన అఖిల్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Jul 17, 2022 | 9:17 AM

Share

యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఏజెంట్ (Agent). డైరెక్టర్ సురేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ పవర్‏ఫుల్ లుక్‏లో కనిపించనున్నాడు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఏజెంట్ టీజర్‏కు భారీ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‏లో యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. ఇక అఖిల్‌ ఆహార్యం, చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌హాప్‌ తమీజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.

ఈ టీజర్‏కు ప్రేక్షకుల నుంచే కాదు.. సినీ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అఖిల్ ఏజెంట్ టీజర్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ” ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగా నచ్చిందని.. చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.” ఇక మహేష్ ట్వీట్ కు అఖిల్ రిప్లై ఇచ్చాడు. ” చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్, ప్రోత్సాహం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము” అంటూ రిప్లై ఇచ్చారు అఖిల్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది. ఇటీవలే అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు..
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు..
ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.2 లక్షల జీతం
ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.2 లక్షల జీతం
కీర్తి సురేష్ కోసం రిస్క్ చేసిన డైరెక్టర్.. ఆ స్టార్ బ్యూటీ రిజెక
కీర్తి సురేష్ కోసం రిస్క్ చేసిన డైరెక్టర్.. ఆ స్టార్ బ్యూటీ రిజెక
భూగోళానికి పైన గజగజ.. కింద వేడివేడి సెగలు
భూగోళానికి పైన గజగజ.. కింద వేడివేడి సెగలు
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది..
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది..
ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు
ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు
ఈ కష్టం ఎవరికి వద్దు.. తండ్రికొడుకుల దుర్మరణం!
ఈ కష్టం ఎవరికి వద్దు.. తండ్రికొడుకుల దుర్మరణం!
జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం
జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం