Liger: లైగర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బాక్సర్‌గా విజయ్ కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా
మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బాక్సర్‌గా విజయ్ కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్+ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లను వుండగా విజయ్ మధ్యలో వుండి ఫైట్ కి సిద్ధమవ్వడం గమనించవచ్చు. లైగర్ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను ఎంఎంఎ ఫైటర్‌గా ప్రజంట్ చేసి థ్రిల్లర్ రైడ్ ని ప్రామిస్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండపై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్.. మైక్ టైసన్‌తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది.
పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్వీట్..
Just one update & India is feeling the tremors already! #LigerTrailer & #VijayDeverakonda Trending National wide on @Twitter within no time ?#LigerTrailerOnJuly21#LIGER@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @DharmaMovies @PuriConnects @sonymusicindia pic.twitter.com/6zl3kem0dt
— Puri Connects (@PuriConnects) July 16, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.