Sita Ramam: సిరివెన్నల కలం నుంచి జాలువారిన మరో అద్భత గీతం.. మెస్మరైజ్‌ చేస్తోన్న ‘సీతారామం’ మెలోడీ సాంగ్..

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌, మృణాళిని ఠాకూర్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం సీతారామం. అందాల రాక్షసితో తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న...

Sita Ramam: సిరివెన్నల కలం నుంచి జాలువారిన మరో అద్భత గీతం.. మెస్మరైజ్‌ చేస్తోన్న 'సీతారామం' మెలోడీ సాంగ్..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2022 | 6:50 AM

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌, మృణాళిని ఠాకూర్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం సీతారామం. అందాల రాక్షసితో తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవాపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తున్న విధానం, పాటలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో పాట ప్రోమోను విడుదల చేసింది. ఈ సినిమాలో ఇది మూడో పాట. ‘కళ్యాణం ఏమన్నది’ అంటూ సాగే ప్రోమోను చిత్రయూనిట్ శనివారం విడుదల చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాట లిరిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. అనురాగ్ కుల‌క‌ర్ణి, సింధూరి పాటను ఆలపించారు. ఇక విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ కంపోజింగ్ మెస్మరైజ్‌ చేస్తోంది. పీఎస్‌ వినోద్‌ కెమెరా విజువల్స్‌ కూడా బాగున్నాయి.

పూర్తి పాటను జూలై 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆగస్టు 5న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మరి టీజర్లతో భారీ హైప్‌ తెచ్చుకుంటున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..