AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం కోసం స్పీడ్ పెంచిన నితిన్..

ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం కోసం స్పీడ్ పెంచిన నితిన్..
Nithiin
Rajitha Chanti
|

Updated on: Jul 17, 2022 | 6:58 AM

Share

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా హీరో నితిన్ హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియోలో ‘మాచర్ల నియోజకవర్గం’ డబ్బింగ్ ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా పప్పు స్టూడియో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ స్టూడియోలో మొదట డబ్బింగ్ జరుపుకుంటున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కావడం విశేషం.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటివల విడుదలైన ‘రారా రెడ్డి’ చార్ట్ బస్టర్ గా యూట్యూబ్ రికార్డ్ వ్యూస్, లైక్స్ తో ట్రెండింగ్ లో వుంది. ఈ స్పెషల్ సాంగ్ లో నితిన్, అంజలి ల కెమిస్ట్రీ, మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఈ చిత్రం నుండి అలాగే తాజాగా విడుదలైన ప్రముఖ నటుడు సముద్రఖని లుక్ కూడా ఆసక్తిని పెంచింది. ఎమ్మెల్యే రాజప్పగా కనిపించిన సముద్రఖని మాచర్ల నియోజకవర్గంపై మరింత క్యూరియాసిటీని పెంచారు.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Follow Us
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు