AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie News: సక్సెస్‌ మోత మోగిస్తున్న గన్స్‌.. ఆ సీన్స్ ఉంటే హిట్టే..!

వెండితెర మీద సెంటిమెంట్లను చాలా సీరియస్‌గా ఫాలో అవుతుంటారు మేకర్స్‌. ఏ సినిమాలో అయినా ఓ సెంటిమెంట్ వర్క్ అవుట్‌ అయితే... తరువాత వరుసగా అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తుంటారు.

Movie News: సక్సెస్‌ మోత మోగిస్తున్న గన్స్‌.. ఆ సీన్స్ ఉంటే హిట్టే..!
Gun Scene In Telugu Movies
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 16, 2022 | 9:36 PM

Share

వెండితెర మీద సెంటిమెంట్లను చాలా సీరియస్‌గా ఫాలో అవుతుంటారు మేకర్స్‌. ఏ సినిమాలో అయినా ఓ సెంటిమెంట్ వర్క్ అవుట్‌ అయితే… తరువాత వరుసగా అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తుంటారు. ప్రజెంట్ అలాంటి ఓ ఇంట్రస్టింగ్ ట్రెండ్‌.. సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేస్తోంది.. థియేటర్లలో మోత మోగిస్తుంది.

ఇదే ఇప్పుడు వెండితెర మీద నయా ట్రెండ్‌. హీరోయిజాన్ని మరింత ఎలివేట్‌ చేసే బిగ్ మెషీన్‌ గన్స్‌… బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ మోత మోగిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఈ ట్రెండ్‌ను స్టార్ట్ చేసింది మాస్ మూవీ మేకర్‌ లోకేష్‌ కనగరాజ్. ఖైదీ సినిమా క్లైమాక్స్‌లో కార్తి వాడిన వెపన్‌… ఆడియన్స్‌ను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. సినిమా సక్సెస్‌లో కార్తి, లోకేష్‌తో పాటు ఈ భారీ మెషీన్ గన్‌ కూడా కీ రోల్‌ ప్లే చేసింది.

కేజీఎఫ్ 2 సక్సెస్ విషయంలోనూ గన్‌ ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. ఫస్ట్ టీజర్‌లోనే హీరోను భారీ గన్‌తో చూపించిన మేకర్స్‌.. సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. సినిమాలో అలాంటి సీన్స్‌ మరికొన్ని కూడా ఉండటంతో కేజీఎఫ్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ సరసన చేరింది.

రీసెంట్‌గా విక్రమ్ మూవీలోనూ ఈ గన్‌ సౌండ్‌ గట్టిగానే రీసౌండ్ చేసింది. విక్రమ్ క్లైమాక్స్‌లో కమల్‌ గన్‌ పేల్చిన తీరు ఆడియన్స్‌ సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది. సినిమా మొత్తం మీద చూపించిన యాక్షన్‌ ఒక ఎత్తు… క్లైమాక్స్‌ సీన్‌లో వచ్చిన గన్‌ సీన్‌ ఒక ఎత్తు అన్నట్టుగా సాగింది విక్రమ్‌ యాక్షన్‌.

అఖిల్‌ ఏజెంట్‌లోనూ ఇలాంటి భారీ గన్‌ సీన్‌ ఒకటి ఉండబోతోంది. తాజాగా టీజర్‌ రిలీజ్ పోస్టర్‌లో భారీ మెషీన్‌ గన్‌తో కనిపించారు అఖిల్‌. ఈ పోస్టర్ చూశాక.. సినిమా సక్సెస్ మీద అక్కినేని అభిమానుల్లో కాన్ఫిడెన్స్ మరింత పెరింగింది. హీరో భారీ మెషిన్ గన్ పేలిస్తే సినిమా సూపర్ హిట్టే అని ఫీల్ అవుతున్న టైమ్‌లో.. అఖిల్ కూడా అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేయటం పాజిటివ్ సైన్‌ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే