Sreeleela: నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీలీల.. ఇచ్చిపడేసిందిగా..
తొలి సినిమాతోనే అందం అభినయంతో పాటు చలాకీ తనంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. ఆతర్వాత మాస్ రాజా రవితేజతో జతకట్టింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్ గా దుసుదుకుపోతుంది ముద్దుగుమ్మ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంటే అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో పాటు చలాకీ తనంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. ఆతర్వాత మాస్ రాజా రవితేజతో జతకట్టింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. సినిమాలతో పాటు ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ‘
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. అందులో ఒకరు మీరు బిగ్ బాస్ షో కు వస్తున్నారా అని ప్రశ్నించాడు. దానికి అవును ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేను వస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. అలాగే ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది శ్రీలీల. మీరు ఎవరికైనా కమిట్ అయ్యారా అని ప్రశ్నించాడు.
దానికి శ్రీలీల అవును అని సమాధానము చెప్పింది. నేను నా పనితో కమిట్ అయ్యాను. ప్రస్తుతం సినిమాలు చేయడమే నా పని అని అదిరిపోయే సమాధానం ఇచ్చింది శ్రీలీల. ఈ చాట్ మొత్తాన్ని శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల వైష్ణవ్ తేజ్ తో కలిసి ఆదికేశవ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



