Chandra Mohan Assists: రూ.100కోట్ల ఆస్తి పోగొట్టుకున్నారు.. వృథాఅయిన చంద్రమోహన్ కష్టం.!
పాత తరం వారికే కాదు.. ఈ తరం వారికి కూడా.. తెలిసిన నటుడు చంద్రమోహన్. ఆ తరంలో హీరోగా.. కమెడియన్‌గా... అందరికీ దగ్గరైన ఈయన.. ఈ తరం వారికి అన్నగా... తండ్రిగా.. పెదనాన్నగా.. దగ్గరయ్యారు. తన నటనతో.. ప్రతీ పాత్రకు జీవం పోసి.. ప్రతీ ఒక్కరికీ దగ్గరయ్యారు. అలాంటి ఈ సీనియర్ నటులు.. హఠాత్తుగా.. మరణించారు. కిడ్నీలు రెండు పాడవడంతో.. గత కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్న చంద్రమోహన్.. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మరణించారు.
పాత తరం వారికే కాదు.. ఈ తరం వారికి కూడా.. తెలిసిన నటుడు చంద్రమోహన్. ఆ తరంలో హీరోగా.. కమెడియన్‌గా… అందరికీ దగ్గరైన ఈయన.. ఈ తరం వారికి అన్నగా… తండ్రిగా.. పెదనాన్నగా.. దగ్గరయ్యారు. తన నటనతో.. ప్రతీ పాత్రకు జీవం పోసి.. ప్రతీ ఒక్కరికీ దగ్గరయ్యారు. అలాంటి ఈ సీనియర్ నటులు.. హఠాత్తుగా.. మరణించారు. కిడ్నీలు రెండు పాడవడంతో.. గత కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్న చంద్రమోహన్.. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మరణించారు. ఇక చంద్రమోహన్ మరణంతో.. గతంలో ఆయన చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాదాపు 900 సినిమాల్లో నటించినా.. తనకు పెద్దగా ఆస్తి లేదని.. ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే పోగొట్టుకున్నా అంటూ.. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. అందర్నీ అయ్యే అనేలా చేస్తున్నాయి. తన కెరీర్ పీక్స్‌లో.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వచ్చిన డబ్బుతో.. భారీగానే భూములను కొనుగోలు చేశారు చంద్రమోహన్. హైద్రాబాద్ లోని కొంపల్లిలో దాదాపు 35 ఎకరాల ద్రాక్ష తోటన .. రైటర్ కమ్ యాక్టర్ గొల్లపూడి మారుతీ రావ్ దగ్గరి నుంచి కొన్నారు. శంశాబాద్ మెయిన్ రోడ్ పక్కనే 6 ఎకరాలు కూడా తీసుకున్నారు. తమిళనాడు, చెన్నైలోనూ దాదాపు 15 ఎకరాల వరకు ఓపెన్ ల్యాండ్ సంపాదించారు. కానీ ఆ ల్యాండ్ మెయిన్ టేన్ చేయలేక చేతులెత్తేశారు. తన బిజీ షెడ్యూల్లో … భూములు కొనడమే కానీ.. వాటిని చూసుకునే తీరిక లేకపోవడంతో.. ఆ భూములను .. చాలా తక్కువ రేటుకే అమ్ముతూ వచ్చారు. చంద్రమోహన్ ఫ్రెండ్ హీరో శోభన్ బాబు ఎంత చెప్పినా కూడా.. వినకుండా.. మొండినా తను అనుకున్నదే చేశారు. ఇక ఆ కారణంగా.. దాదాపు 100 కోట్ల వరకు నష్టపోయారు చంద్రమోహన్. ఇక ఇదే విషమయాన్ని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకున్న చంద్రమోహన్.. జీవితంలో తాను చేసిన పొరపాటు ఇదే అంటూ.. ఎమోషనల్ అయ్యారు. అప్పటి ఆ వీడియోలతో.. మాటలతో.. ఇప్పుడు నెట్టింట మరో సారి వైరల్ అవుతున్నారు ఈ లెజెండ్ నటుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.