Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Mohan: రాఖీ సినిమా షూటింగ్లో చంద్రమోహన్కు గుండెపోటు.. ఆ టైంలో ఏడాదికి 30 నుంచి 40 సినిమాలు.

Chandra Mohan: రాఖీ సినిమా షూటింగ్లో చంద్రమోహన్కు గుండెపోటు.. ఆ టైంలో ఏడాదికి 30 నుంచి 40 సినిమాలు.

Anil kumar poka

|

Updated on: Nov 12, 2023 | 2:32 PM

తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన నటుడు చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 11 శనివారం రోజున మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబోలో వచ్చిన రాఖీ మూవీ షూటింగ్ సమయంలో చంద్రమోహన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు.

తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన నటుడు చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 11 శనివారం రోజున మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబోలో వచ్చిన రాఖీ మూవీ షూటింగ్ సమయంలో చంద్రమోహన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు. అప్పటివరకు ఏడాదికి 30 నుంచి 40 సినిమాలు చేస్తూ వచ్చిన చంద్రమోహన్ రాఖీ సినిమా తరువాత సినిమాలను పూర్తిగా తగ్గించేశారు. వైద్యుల సలహా మేరకు సినిమాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే జీవితాన్ని గడిపేవారు. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ సమయంలో కూడా చంద్రమోహన్ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డారు. దీంతో ఇక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్‌ చిత్రం చంద్రమోహన్ చివరిది కావడం గమనార్హం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు చంద్రమోహన్‌ . ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. హీరోగానే కాకుండా కమెడియన్, సహాయనటుడిగానూ మెప్పించారు. హైదరాబాద్‌లో సోమవారం చంద్రమోహన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 12, 2023 01:18 PM