Samyuktha: ‘విరూపాక్ష’ దర్శకుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త.. ఏంటంటే..
ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమాకు భారీగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూకుడు మీదున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన సంయుక్త కథానాయికగా నటించింది. ఈ మూవీ విజయంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది సంయుక్త. దీంతో తాజాగా ఈ బ్యూటీ డైరెక్టర్ కార్తీక్ దండుకు స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. హర్రర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమాకు భారీగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూకుడు మీదున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన సంయుక్త కథానాయికగా నటించింది. ఈ మూవీ విజయంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది సంయుక్త. దీంతో తాజాగా ఈ బ్యూటీ డైరెక్టర్ కార్తీక్ దండుకు స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
అదేంటంటే.. ఐఫోన్. ఇదే విషయంపై సంయుక్త మాట్లాడుతూ.. “ఈ మూవీ హిట్ కావడంతో కార్తీక్ కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. విరూపాక్ష రిలీజ్ రోజు ఓ థియేటర్లో అతని ఫోన్ ఎవరో కొట్టేశారు. దీంతో సినిమా రెస్పాన్స్ చూడటానికి వేరే వాళ్ల ఫోన్లలో చూసేవాడు. అందుకే వెంటనే ఐఫోన్ కొని గిఫ్ట్ గా ఇచ్చాను ” అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్త హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత బింబిసార, సార్ సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ అందుకుని గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్న అవకాశాలు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.