AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Kanna: పెళ్లి కోసమే సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు.. అసలు కారణం ఇదే.. హీరోయిన్ రాశి ఖన్నా కామెంట్స్..

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే ఇన్నాళ్లు తాను కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయకపోవడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది.

Rashi Kanna: పెళ్లి కోసమే సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు.. అసలు కారణం ఇదే.. హీరోయిన్ రాశి ఖన్నా కామెంట్స్..
Rashi Khanna
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2023 | 9:26 AM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. ఇటీవలే రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఫర్జీ సిరీస్ లో ఓ లీడ్ రోల్ చేశారు. రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఈ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే ఇన్నాళ్లు తాను కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయకపోవడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది.

రాశి ఖన్నా మాట్లాడుతూ.. “ఫర్జీ సిరీస్ లో నేను చేసిన మేఘా వ్యాస్ పాత్రకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమంత, కీర్తి సురేష్ బాగుందంటూ కామెంట్స్ చేశారు. వీరితోపాటు.. కొందరు దర్శక నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు, తమిళ్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే నేను పెళ్లి కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో మూడు, తమిళంలో మూడు కథలు విన్నాను. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఫర్జీ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశాను. అంతే. త్వరలోనే నా కొత్త సినిమా ప్రకటనలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు తెలుగులో చాలా లవ్ స్టోరీస్ చేశాను. కామెడీ రోల్స్ చేశాను. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉంది. బాహుబలిలో అనుష్క గారు చేసిన యువరాణిలాంటి పాత్ర చేయాలని ఉంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఏ పాత్రనైనా నేను డ్రీమ్ రోల్ గానే భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!