Rajisha Vijayan: ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్.. ఆ సినిమాటోగ్రాఫర్‌తో రజిషా విజయన్ ప్రేమాయణం ?..
ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. 'అనురాగ కరికిన్ వేళం' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీకే ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డ్ అందుకుంది. గ్లామర్ కాకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రజిషా విజయన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మాహారాజా రవితేజ జోడిగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ‘అనురాగ కరికిన్ వేళం’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీకే ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డ్ అందుకుంది. గ్లామర్ కాకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రజిషా విజయన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఆమె కొన్నాళ్లుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా.. ఇటీవలే టోబిన్ థామస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీరిద్దరి చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుంది.
టోబిన్ థామస్.. తన ఇన్ స్టాలో రజిషా విజయన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అంటూ రాసుకొచ్చారు. ఇక టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై ఇచ్చింది. 1461 = 30 x ? + 1 x ? – 1 x ? – 2 x ?.. నిన్ను చూడడం కోసమే అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం ఇప్పుడు అఫీషియల్ గా తెలిసింది. టోబిన్ ఇన్ స్టాలో రజిషా విజయన్‌తో కలిసి ఉన్న ఫోటోస్ అనేకం చూడవచ్చు. వీరిద్దరికి ఇప్పుడు నెటిజన్స్, సెలబ్రెటీ స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
రజిషా విజయన్, టోబిన్ థామస్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ఖోఖో. 2021లో విడుదలైన ఈ చిత్రానికి రాహుల్ రంజిత్ దర్శకత్వం వహించారు. క్రీడా పోటీల నేపథ్యంలో సాగే ఖోఖో చిత్రంలో రజిషా నటన కూడా ఆకట్టుకుంది. అలాగే రజిషా నటించిన లవ్లీ యువర్స్ వేద చిత్రానికి టోబిన్ సినిమాటోగ్రాఫర్. చాలా కాలంగా సీక్రెట్‌గా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేమను కన్ఫార్మ్ చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



