AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన వరుణ్.. లావణ్య కాకుండా ఎవరంటే..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. వచ్చే నెల మార్చి 1న ఈమూవీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

Varun Tej: తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన వరుణ్.. లావణ్య కాకుండా ఎవరంటే..
Varun Tej
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2024 | 8:55 AM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ మూవీలో మానుషి చిల్లర్ నటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. వచ్చే నెల మార్చి 1న ఈమూవీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ వేడుక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.ఈ వేడుకలో మూవీ టీం సందడి చేసింది. ఈ క్రమంలోనే కాలేజీ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు వరుణ్ తేజ్. ‘మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ?’ అని అడగ్గా.. వరుణ్ మాట్లాడుతూ.. ‘నా ఫేవరేట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను. మంచి కథలు వస్తే.. నేనూ లావణ్య కలిసి చేస్తాం. మా ఇద్దరిలో నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను’ అని అన్నారు వరుణ్. అలాగే తనకు లావణ్య కాకుండా సాయి పల్లవి అంటే అభిమానమని అన్నారు.

కామెడీ సినిమాలు వంద చేయొచ్చు కానీ.. దేశం కోసం ఏది చేసిన గొప్పగానే ఉంటుందని.. ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు వరుణ్. అలాగే మట్కా సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ అని.. గద్దల కొండ గణేష్ మూవీ తరహాలో అందులో తన పాత్ర ఉంటుందని అన్నారు. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయాలని తనకు ఉందని.. కానీ మంచి కథ దొరకాలని అన్నారు.

ఇదిలా ఉంటే.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ పైలట్ గా కనిపించనున్నారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ మూవీలో అద్భుతంగా చూపించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘గగనాల తేలేను నీ ప్రేమలోన’.. అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ఆర్మాన్ మాలిక్ ఆలపించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ కాకుండా వరుణ్ తేజ్ మట్కా సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.