AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Music Events: మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా.. హైదరాబాద్‏లో జరిగే ఈ ఈవెంట్స్ గురించి తెలుసా ?.

తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం.. ఇలా భాష ఏదైనా మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయని మీకు తెలుసా ?.. సంగీత ప్రియులకు.. పార్టీ ప్రియులకు.. లేదా సరదాగా కాసేపు ఎంజాయ్ చేయాలనుకునే వారికి హైదరాబాద్‌లో కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. నగరంలో సంగీత కచేరీలు, కార్నివాల్స్ నుంచి ఎక్స్ పోస్ వరకు అనేక ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు.

Music Events: మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా.. హైదరాబాద్‏లో జరిగే ఈ ఈవెంట్స్ గురించి తెలుసా ?.
Music Events
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2024 | 8:16 AM

Share

ఒక సినిమా మీద హైప్ రావాలి అంటే ముందుగా పాటలు క్లిక్ కావాల్సిందే. సాంగ్స్ బాగుంటే సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అందుకు దర్శకనిర్మాతలు సాంగ్స్ పై మరింత ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. నిజానికి సంగీతానికి భాష అక్కర్లేదు… భావం అర్థం కాకపోయినా ప్రశాంతత కలిగిస్తుంది. తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం.. ఇలా భాష ఏదైనా మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయని మీకు తెలుసా ?.. సంగీత ప్రియులకు.. పార్టీ ప్రియులకు.. లేదా సరదాగా కాసేపు ఎంజాయ్ చేయాలనుకునే వారికి హైదరాబాద్‌లో కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. నగరంలో సంగీత కచేరీలు, కార్నివాల్స్ నుంచి ఎక్స్ పోస్ వరకు అనేక ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. ప్రఖ్యాత గాయకుల నుంచి వర్ధమాల ప్రతిభావంతుల వరకు హైదరాబాద్ లో జరిగే సంగీత కచేరీలలో పాల్గొంటారు. మరీ సిటీలో జరిగే కొన్ని మ్యూజిక్ ఈవెంట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

హైదరాబాద్‌లో రాబోయే మ్యూజిక్ ఈవెంట్స్..

1. గ్రామీ-విజేత తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ 2024 గ్రామీ అవార్డ్స్‌లో తన చారిత్రాత్మక విజయం అందుకున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో సంగీత కచేరీ నిర్వహించనున్నారు. మెలోడీ ఆఫ్ రిథమ్ పేరుతో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, నిలాద్రి కుమార్ మ్యూజిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరగనుంది. టిక్కెట్ ధర – రూ 750 నుండి

2. ఫిబ్రవరి 25న సలామ్ సౌక్ ఎడిషన్ 5లో బాలీవుడ్ లెజెండ్ లక్కీ అలీ మ్యూజిక్ ఈవెంట్ జరగనుంది. మ్యాజికల్ హస్కీ వాయిస్‌కు పేరుగాంచిన లక్కీ అలీ తన టైమ్‌లెస్ క్లాసిక్‌లతో ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. ఈ ఈవెంట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. టిక్కెట్ ధర – రూ 249 నుండి.

3. ముంబైకి చెందిన పాప్ రాక్ సంచలనం సనమ్.. హైదరాబాద్‌లో మ్యూజిక్ ఈవెంట్ చేయనున్నారు. క్లాసిక్ బాలీవుడ్ పాటలకు సనమ్ కేరాఫ్ అడ్రస్. సనం, సనమ్ పూరి, సమర్ పూరి, వెంకీ ఎస్, కేశవ్ ధనరాజ్‌లతో ఈవెంట్ జరగనుంది. మార్చి 9న గండిపేటలోని హార్ట్‌కప్ కాఫీ లో నిర్వహించనున్నారు. టిక్కెట్ ధర – రూ 799 నుండి

4. సోషల్ మీడియా సంచలనం హైదరాబాదీ స్ట్రీట్ రాపట్ కేడెన్ శర్మ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల రాపర్ కేడెన్ శర్మ (ఆదిత్య శర్మ), MTV హస్టిల్ 3లో అలరించాడు. తన స్ట్రీట్-స్టైల్ ర్యాప్, వైరల్ ట్రాక్ ‘స్ట్రీట్ సెలబ్రిటీ’తో కేడెన్ హృదయాలను గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 10న నానక్రామ్‌గూడలోని వన్ గోల్డ్ బ్రూవరీలో ఈవెంట్ జరగనుంది. టిక్కెట్ ధర – రూ 1000 నుండి.

5. 10 భారతీయ భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించాడు సింగర్ కార్తీక్. దాదాపు 1000కి పైగా పాటలతో సంగీత ప్రపంచంలో టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 24న బౌల్డర్ హిల్స్ సింగర్ కార్తీక్ మ్యూజిక్ ఈవెంట్ జరగనుంది. టిక్కెట్ ధర – రూ 1299 నుండి

కాబట్టి మ్యూజిక్ లవర్స్.. ఈ ఈవెంట్స్ అస్సలు మిస్ అవకండి. హైదరాబాద్ సంగీత ప్రియులకు ఈ రిథమ్ ఆఫ్ మ్యూజిక్ ఈవెంట్స్ మరపురాని సంగీత అనుభవాన్ని అందించడం ఖాయం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.