Tollywood: నటనకు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్.. బౌద్ధ సన్యాసిగా మిస్ ఇండియా రన్నరప్..

ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసిగా మారింది. ఆమె ఇన్ స్టాలోనూ అన్ని ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ?

Tollywood: నటనకు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్.. బౌద్ధ సన్యాసిగా మిస్ ఇండియా రన్నరప్..
Barkha Madan
Follow us

|

Updated on: Feb 07, 2024 | 7:48 AM

సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీపడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసిగా మారింది. ఆమె ఇన్ స్టాలోనూ అన్ని ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ? తనే బర్ఖా మదన్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మోడల్. 1994లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. అందాల కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లతో పోటీ పడి మొదటి రన్నరప్ గా నిలిచారు. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా నిలిచారు. మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది.

1996లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ అరంగేట్రం చేశారు. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘భూత్’ సినిమాలోనూ నటించారు. మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్లలోనూ నటించారు బర్ఖా. 1857 క్రాంతితో సహా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ఇందులో ఆమె రాణి లక్ష్మీబాయి పాత్రను పోషించింది. భూత్ తర్వాత, బర్ఖాకు ఆమె కోరుకున్న పాత్రలు లభించకపోవడంతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. 2005 నుండి 2009 వరకు ప్రముఖ జీ టీవీ షో సాత్ ఫేరే – సలోని కా సఫర్‌లో కనిపించింది.

2010లో నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. ప్రతిభావంతులైన స్వతంత్ర చిత్రనిర్మాతలను ప్రోత్సహించడానికి గోల్డెన్ గేట్ LLCని ప్రారంభించింది. సోచ్ లో, సుర్ఖాబ్ అనే రెండు చిత్రాలను నిర్మించి, నటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి సన్యాసిగా మారిపోయారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పర్వతాలు, ఆశ్రమాలలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. తన జీవితాంతం దలైలామాను అమితంగా అనుసరించిన బర్ఖా, 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పటికీ ఆమె అనుకున్న పని జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.