Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డబ్బులు ఇచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు.. ఇంతగా దిగజారతారా..! టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. సినీరంగంలోని అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఆ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. వరుసగా హిట్స్ అందుకుంటున్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Tollywood: డబ్బులు ఇచ్చి నాపై ట్రోలింగ్ చేయించారు.. ఇంతగా దిగజారతారా..! టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2025 | 9:13 PM

టాలీవుడ్ సినీరంగంలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాల నుంచి తప్పుకుంది పూజా. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఇటు తెలుగు సినిమాలకు దూరమయ్యింది. ఆ తర్వాత అటు హిందీలోనూ యాక్టివ్ గా లేకుండా సైలెంట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా.. పీఆర్ స్ట్రాటజీలతో తనపై ట్రోలింగ్ చేయించారని చెప్పుకొచ్చింది. అది తనను ఎంతగానో షాక్ కు గురి చేసిందని చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే మాట్లాడుతూ.. “మీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెట్టాయి.. నా గురించి కంటిన్యూగా తిడుతున్నారేంటీ అనుకున్నాను. ఆతర్వాత తెలిసింది. నన్ను కావాలని టార్గెట్ చేసి.. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈరకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని. ఆ సమయంలో నాతోపాటు నా ఫ్యామిలీ కూడా బాధపడింది. మరీ ఇంతకు దిగజారతారా ? అనిపించింది. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్ చేయించారు. కానీ నేను దానిని ఒక ప్రశంసగా కూడా తీసుకున్నాను ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని కిందకు లాగాలని భావిస్తే వారి కంటే మనం పైనే ఉన్నామని అర్థం కదా. కానీ ఆ పద్దతి మరింత ఎక్కువైంది. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. దీంతో వారి బాధ ఏంటో కనుక్కోమని నా టీంకు చెప్పాను. వాళ్లు ఆ మీమ్ పేజెస్ ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు.

ట్రోలింగ్ ను ఆపేయాలన్నా.. అవతలి వారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకు మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్స్ నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరంగా కామెంట్స్ పెడతారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ కు వెళ్లి చూస్తే అక్కడ ఏమి ఉండదు. కనీసం ఒక ఫోటో కూడా ఉండదు. కేవలం డబ్బు ఆశ చూపించి ఇలాంటివి చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది” అంటు చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!